Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప మహోన్నతమున సర్వేశ్వరునికి
మహిమ కలుగునుగాక
భూలోకమున జనులందరికి
శాంతి సమాధానము
1. ఏలిన వారైన సర్వేశ్వరా
పరలోక ఆసీనుడా
పితయైన మా దేవా - సర్వశక్తిమంతుడా
మిమ్ము పొగడెదము-మిమ్ము స్తుతించెదము
మిమ్ము ఆరాదించి -మిమ్ము ఘనపరిచేదం
మీ నిజమైన భవమునకై - మీకు
వందనములర్పించుచున్నాము. ||మ||
2. జనితైక పుత్రుడా ఏలినవారైన క్రీస్తువా
ఏలిన వారైన సర్వేశ్వర
సర్వేశ్వరుని గొఱ్ఱపిల్ల
పితయొక్క పుత్రుడా-పుడమి పాపములన్ని
పరిహరించెడు వారా-మాకు దయచూపండి
లోక పాపములు మన్నించువాడా
మా మనవి ఆలకించుడి ||మ||
3. పితయొక్క కుడిప్రక్కన కూర్చొని యున్నవాడా
మమ్మెప్పుడు నాదరించండి
మీరొక్కరై పరిశుద్దులు
ఏలయన మీరొక్కరే అధిపతులైయున్నారు
పితయైన సర్వేశ్వరుని -మితిలేని మహిమలో
పవిత్రాత్మతో కూడి-పరిపాలించెడు వాడా||మ||