Type Here to Get Search Results !

మహోన్నతమునా సర్వేశ్వరునికి ( mahonathamuna sarveswaruniki Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


గ్లోరియా... గ్లోరియా... గ్లోరియా.... ||2|| 

మహెూన్నతమునా సర్వేశ్వరునికి మహిమ కలుగునుగాక

ఘన మహిమ కలుగును గాక ||2|| 

భూలోక వాసులకు శాంతి సమాధానం ||2|| 

కలుగును గాకా... ఇల కలుగును గాక ||2|| ||మహో|| 


1. ఏలినవారైన సర్వేశ్వరా పరలోక రాజా

సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా

మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము

మిమ్ము ఘనపరచుచున్నాము,

మీ దయనే ఇలలో కోరెదము ||2|| ||మహో|| 


2. జనితైక పుత్రుడ యేలినవార పిత ప్రియ సుతుడా

సర్వేశ్వరుని ఓ దివ్య గొర్రెపిల్లా

మిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము

ఆరాధించుచున్నాము ||2|| 

లోక పాపములను హరించుటకై భువిలో వెలసిన

మా ప్రభువా ||2|| ||మహో|| 


3. పిత కుడి ప్రక్కన మహాఘనతతో కూర్చున్నవారా

మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా

మిమ్ము పొగడుచున్నాము - స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము

మీ ఘనమును గూర్చి చాటెదము ||2|| 

మీ దయనే ఇలలో కోరెదము ||2|| ||మహో|| 


4. మహెూన్నతులు మీరొక్కరే పరిశుద్ద దేవా

మహెూన్నతులు మా పావన శ్రీయేసువా

మిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము 

ఆరాధించుచున్నాము ||2|| " 

పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ||2|| 

ఆ..ఆ..ఆ..ఆ..ఆ. ఆమెన్.... ఆ..ఆ..ఆ..ఆ. ఆమెన్


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section