Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: నిన్నే ప్రేమింతును యేసయ్య
ప. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమ
భూలోక వాసులకు సమాధానము ||2|| ||మ||
1. ఏలినవారైన సర్వేశ్వరా - పరలోకరాజా
సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా
మిమ్ము పొగడుచున్నాము
స్తుతించుచున్నాము. ||2||
మీ దయనే ఇలలో కోరెదము ||2|| ||మ||
2. జనితైక సుతుడా ఏలినవారా
ఓ దివ్య గొర్రెపిల్లా
లోక పాపములు పరిహరించెడివారా
మిమ్ము పొగడుచున్నాము
స్తుతించుచున్నాము. ||2||
మీ దయనే ఇలలో కోరెదము ||2|| ||మ||
3. పిత కుడిప్రక్కన మహాఘనతతో
కూర్చొని యున్నవారా
మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా
స్తుతించుచున్నాము. ||2||
మీ దయనే ఇలలో కోరెదము ||2|| ||మ||
4. మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా
సర్వేశ్వరుని మహిమలో నుండువారా ||మ||
ఆ... ఆ... ఆమెన్-ఆ... ఆ... ఆమెన్ ||2||