Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: నీ రాగంలో నేస్వరమై
ఏలినవారా దయచూపండి
క్రీస్తువా దయచూపండి
ఏలినవారా దయచూపండి ,
ప. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ
భూలోకమున వారి ప్రేమపాత్రులకు
సమాధానము
1. ఏలినవారైన సర్వేశ్వరా! పరలోక రాజా!
సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా!
మిమ్ము పొగడుచున్నాము
మిమ్ము నారాధించుచున్నాము
మిమ్ము ఘనపరచుచున్నాము
మీ మహావైభవమునకై
మీకు వందనములు అర్పించుచున్నాము,
2. జనితైక పుత్రుడా! ఏలినవారైన యేసుక్రీస్తువా!
ఏలినవారైన సర్వేశ్వరా! సర్వేశ్వరుని గొఱ్ఱపిల్లా!
పితయొక్క పుత్రుడా!
లోకముయొక్క పాపములను పరిహరించేవారా!
మాకు దయచూపండి
లోకముయొక్క పాపములను
పరిహరించెడివారా!మా మనవినాలకించండి
3. పితయొక్క కుడిప్రక్కన కూర్చుని
యున్నవారా! మాకు దయచూపండి.
ఏలయన, మీరొక్కరే పరిశుద్దులు
మీరొక్కరే ఏలినవారు
మీరొక్కరే మహోన్నతులు జేసుక్రీస్తువా!
పితయైన సర్వేశ్వరుని మహిమలో
పవిత్రాత్మతో నుండువారా! ఆమెన్