Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మహెూ...న్నతుడైన సర్వేశ్వరునికి మహిమ మహిమ మహిమ
భూలోక వాసులకు సమాధానం సమాధానం
1. ఏలినవారైన సర్వేశ్వరా పరలోక రాజా
సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా
మిమ్ము పొగడు చున్నాము ఆ...ఆ...ఆ...
మిమ్ము స్తుతించుచున్నాము ఆ...ఆ...ఆ..
మీ దయనే ఇలలో కోరెదము
2. జనితైక సుతుడా ఏలినవారా-పిత ప్రియ పుత్రుడా
సర్వేశ్వరుని గొఱ్ఱపిల్లా
మిమ్ము పొగడు చున్నాము ఆ...ఆ...ఆ..
మిమ్ము స్తుతించుచున్నాము ఆ...ఆ...ఆ..
లోకపాపములన్ హరించుటకై ఇలలో వెలసిన మా ప్రభువా
3. పిత కుడి ప్రక్కన మహా ఘనతతో కూర్చున్నవారా
మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా
మిమ్ము పొగడుచున్నాము ఆ...ఆ...ఆ..
మిమ్ము స్తుతించుచున్నాము ఆ..ఆ.. ఆ..
మీ దయనే ఇలలో కోరెదము
4. మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ద దేవా
మహెూన్నతులు మా యేసు క్రీస్తువా
మిమ్ము పొగడు చున్నాము ఆ...ఆ...ఆ..
మిమ్ము స్తుతించుచున్నాము ఆ...ఆ...ఆ..
పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా
ఆ...ఆ...ఆ....ఆమెన్ ఆ...ఆ...ఆ....ఆమెన్