Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమ
భూలోక వాసులకు - సమాధానము ||2|| ||మ||
1. ఏలినవారైన సర్వేశ్వర - పరలోక రాజ
సర్వశక్తిగల పితయైన - సర్వేశ్వర
మిమ్ము పొగడుచున్నాము ఆ....ఆ....ఆ....
మిమ్ము స్తుతించుచున్నాము ఆ. ఆ.ఆ.||2||
మీ దయనే ఇలలో కోరెదము ..... ||2|| ||మ||
2. జనితైక సుతుడ ఏలినవార
పితప్రియ పుత్రుడా
సర్వేశ్వరుని - గొఱ్ఱపిల్లా...... ||మి||
లోక పాపములన్ హరించుటకై
ఇలలో వెలసిన మా ప్రభువా ||మ||
3. పిత కుడిప్రక్కన మహా ఘనతతో
కూర్చున్న వారా మా నేత్రములను
తెరిపించు-సర్వేశ్వరా . ||మి||
మీ దయనే ఇలలో కోరెదము ||2|| ||మ||
4, మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా
మహోన్నతులు మా యేసు క్రీస్తువా ||మి||
పితయైన సర్వేశ్వరుని మహిమలో
పవిత్రాత్మతో నుండు వారా....... ||మ||
ఆ.ఆ.ఆ. ఆమెన్.ఆ... ఆ... ఆ... ఆమెన్ ||2||