Type Here to Get Search Results !

మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమ కలుగును గాక ( mahonathudaina sarveswaruniki mahima kalugunu gaka Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ కలుగుగాక 

భూలోకమున జనులందరికి శాంతి సమాధానము ||2|| 


1. ఏలినవారైన సర్వేశ్వరా - పరలోక ఆశీనుడా

పితయైన మా దేవా - సర్వశక్తి మంతుడా

మిమ్ము పొగడెదము - మిమ్ము స్తుతించెదము

మిమ్ము ఆరాధించి - మిమ్ము మహా ఘనపరచెదం

మీ నిజ వైభవమునకై మీకు వందనములర్పించుచున్నాము


2. జనితైక పుత్రుడా - ఏలినవారైన క్రీస్తువా

ఏలినవారైన సర్వేశ్వరా - సర్వేశ్వరుని గొఱ్ఱపిల్లా

పితయొక్క పుత్రుడా - పుడమి పాపములన్ని

పరిహరించెడువారా - మాకు దయచూపండి

లోక పాపముల్ మన్నించువారా - మా మనవి ఆలకించండి


3. పితయొక్క కుడిప్రక్కన కూర్చొని యున్నవారా

మమ్మెప్పుడు నాదరించండి - మీ రొక్కరే పరిశుద్దులు

ఏలయన మీ రొక్కరే - అధిపతులైయున్నారు

పితయైన సర్వేశ్వరుని - మితిలేని మహిమలో

పవిత్రాత్మతో కూడి – పరిపాలించెడువార


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section