Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. మల్లెవంటి మనస్సులు అర్పించగ వచ్చాము
స్వీకరించుమో దేవా ఈ పేద కానుక ||2||
గైకొనుమా తండ్రి ఈ నిరుపేద కానుక ||2||
1. మా శ్రమలతో పండించిన
ఈ భూఫలమును
మాహృదయములతో చేర్చి మీ కర్పింతుము||2||
మా మదిలో చిన్ని కోరిక
అదియే మాకు కానుక
2. ఆనాడు నీవు అర్పించిన సిలువబలి
ఈనాడు మాకు నిత్య జీవమిచ్చు ఫలము
దహనబలులు నీవు కోరలేదు
సోదర ప్రేమ మా అర్పణ ||మ||