Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. మనసులు మమతలు-అన్నియు నీ కొరకే
అంతయు నీకెరుకే అంజలి చేకొనుమా
1. సత్యము కోరు మతమొకటి
మనసున నిండివుంది
వసుధను బ్రోచు వేదముకై
ఊపిరి నివ్వాలనుంది
తిమిరముతో సమరము లెన్నెదురైన
నీ ప్రేమకు నా ప్రాణము బదులైన
ఎన్నెన్నో ఆటంకములెన్నియు వెంటాడినను
ఏసువాతొలగిపోను నీ పథమున ||మ||
2. నా జీవితమునకు
పరమార్థం నీలోగాంచిననాడే
నాలోని యీస్వార్థం బంధం తెంచెను గాదే
నా సర్వము నా సకలము మరుగైన
ఏ స్నేహము ఏ పాశము కరువైన
నిత్యానందము వెదకెడి
నీ ప్రజలకే నా సర్వం
ఏసువ నన్ను నీకు సమర్పింతును ||మ|| .