Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
మల్లెవంటి ` నా మనసిదిగో
ఆ మనసుతో తెచ్చిన ` కానుకలివిగో
దయతో చేకొను ` ఘనమగు దేవా
శ్రీకర శుభకర ` మంజుల కానుక
1 వ చరణం..
నా హృదయం ` గోధమ పంటగ
ఫలియించెను ` సమృద్ధిగ గింజలు ||2||
రుచియగు గోధుమ ` అప్పము తెచ్చితి ||2||
స్వీకరించుమా ` చిన్న కానుక ....
2 వ చరణం..
నా మనసే ఒక ద్రాక్షవల్లిగ
ఫలియించెను ` పలు రెమ్మలు గుత్తులు ||2||
రుచియగు ఫలముల ` రసమును తెచ్చితి ||2||
స్వీరించుమా ` చిన్ని కానుక ....