Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. మమతల మధురిమ వాహినిలో
విరిసిన కలువవు నీవమ్మా
మానవ రక్షణ యజ్ఞములో
నలిగిన సమిధవు నీవమ్మా
కొ. అమ్మా..అమ్మా....ఓ ...మరియమ్మా
1. యావే దేవుని తలపులలో
ఎగసిన తీయని కోరికవు
పావన ఆత్మకు నీ హృదయం
ఇలలో వెలసిన ఆలయము ||అ||
2. మనిషిగ మారిన దేవునికి
మాతగ మారిన ఆలయము ||అ||
నూతన రీతిన భువిపైన
పాపము చావగ వెలిశావు ||అ||