Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. మమతానురాగాల ఈ విందు
మధురానుబంధాల ఈ విందు
పరవశముతో స్వీకరించు
పరమౌషధమైన ఈప్రభుని విందు ||2||
మనుజాళి రక్షింప ఈ విందు
మదిలోన వెలసిన ఈ విందు ||2||
1 జీవమొసగే జీవాహారము.
సత్య దేవుని ప్రేమదానము ||2||
అమర జరులు ఆత్మబలము ||2||
ప్రేమ పండించే ప్రభుని భోజ్యము ||పర||
2 వెలుగులోని తేజోమయము
అప్పమందు ప్రభుని దేహము ||2||
అలసిసొలసిన అవని జనులకు ||2||
సేదతీర్చు పరమ భోజ్యము ||పర||