Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. మరియాతనయా రావా
కరుణా భరణా దేవా .......ఆ....... ||మ||
1. కలుషపు చీకటి ద్రోలి
పున్నమి చంద్రుని బోలె
ధగధగ వెన్నెల నింపు
పరిశుద్ధాత్ముని పంపు ||మ||
2. నీపర దూతల విందు
పాపపు రోగపు మందు
తీరుసభ గురువుల కలిమి
సకల పునీతుల బలిమి ||మ||
3. చచ్చిరి మన్నా కుడిచి
చావరు నిన్నట కుడిచి
హతులగు భక్తుల తీపా
అనుంగు బిడ్డల ప్రాపా
4. ఆశ్రిత కల్పక తరువా
పరమున చేర్చెడి తెరవా
అనఘు విరక్తుల కోటా
వరములు పూచేడు తోటా ||మ||