Lyrics: Br. B Anil Kumar,
Tune: unknown
Music: Kiran B, Praneeth D
Album: లాలనుచు పాడరే - 2
ప. మానవాళి రక్షకుడు
మహిమాన్విత దేవుడు ||2||
బెత్లహేములో పశుల పాకలో ||2||
మనకై ఉదయించాడు
మనిషిగ జన్మించాడు ||2|| ||మా||
1. స్పర్ధను తొలగించి సఖ్యత కలిగించ
మమతను నేర్పించి మనుగడ చూపించ
రక్షణ సందేశంతో
తనకృపలో నడిపించ ||2||
అనురాగం పండించి
సంరక్షణ అందించ. ||2|| ||మా||
2. అణకువ నేర్పించి అభయమునందించ
పాపము పెకలించి
శాపము తొలగించ ||2||
శాంతి సుధలు కురిపించి తన
ప్రేమలో జీవింప ||2||
మానవతను ఇల నిలిపి ప్రతి
మనిషిని రక్షింప ||2|| ||మా||