Type Here to Get Search Results !

మెరుపుల తారలు నింగిన ( merupula tharalu ningina Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. మెరుపుల తారలు నింగిన వెలిగెను 

తనయుని చూచుటకు 

మమతలు మేడలు జగతిని చేరెను

ప్రేమను పంచుటకు 

లోకానికే వెలుగుగా 

త్యాగానికే రూపుగా ||2|| 

బెత్లెము నిలిచేను-పశువుశాలై మురిసెను 

గొల్లలు చేరిరి ఆనందించిరి 

చిన్నారి బాలుని పద సన్నిధిలో 

అదిగో తూర్పు జ్ఞానులు చేరెనుగా

ప్రభు సన్నిధిని 

విలువైన కానుకలు సమర్పించిరి

గ్లోరియా....గ్లోరియా....గ్లోరియా....||8|| 


1. దివినుండి భువికి ఏతెంచినాడు

మనుజాళినే ఇల అలరించినాడు 

బోసినవ్వుల పాపడు-లోకానికే రక్షకుడు ||2|| 

బాలయేసుని ముద్దిడ రార 

నిలిచెను మన మధ్యలో

మమతల మల్లెల పందిరిగా ||గో|| 


2. దూతలు పాడిరి జయ జయ గానం

అంబరమంతట ఆనంద నృత్యం ||2|| 

ముద్దులొలికే బాలుడు 

మురిపాలకే మిత్రుడు ||2|| 

కన్యక ఒడిలో ఆడెను లేరా 

పులకించెను ప్రకృతి 

చూసి ఆనందమాయెను పచ్చికలా ||మే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section