Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: యేసయ్యా
ప. మనసార పాడెదము దేవుని గీతము
ముదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము
ఈ జీవవాక్యం మనకెంతో మధురము
మన జీవితాలకు ముక్తిమార్గము
అల్లెలూయ ... అల్లెలూయ..
అల్లేలూయ.. అల్లేలూయ..
1. అబ్రహాముని ప్రేమతో పిలిచిన ఈ వాక్యము
ఈ వాక్యము దివినెల్ల, భువినెల్ల
వ్యాపించిన ఈ వాక్యము
మార్గం, సత్యం, జీవము
మధురం, అమరం, ప్రేమము
ఈ జీవ వాక్యం
అల్లెలూయ ... అల్లెలూయ ||2||
2. గాలి అలను గద్దించిన ఈ వాక్యము
యెరూషలేము స్త్రీలకు
ఊరటనిచ్చిన ఈ వాక్యము
నిత్యం, నిరతం, సర్వము ఈ వాక్యము
ప్రేమ, సేవ, శాంతి ఈ జీవవాక్యం ..
అల్లెలూయ ... అల్లెలూయ... ||మ||