Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మనసెరిగిన దేవా మా యేసు ప్రభువా ||2||
మాలోకి భోజ్యమై అరుదెంచినావా ||2||
మా జీవ జీవమై మా తోడుగ ఉన్నావా
ఈ పేద గుడిలో పూజింప నీవాllమనll
1 వ చరణం..
నడి సంద్రపు అలలను చీల్చిన ఆ ఘనుడవు ||2||
అగ్ని స్తంభమై నడిపించిన దేవుడవు
దావీదు మందసమున నెలవైన విభుడవు
సొలోమోను మందిరాన కొలువైన మా ప్రభుడవు llమా జీవll
2 వ చరణం..
ధర పాప ఫలితము నలిగిన నీ దేహము ||2||
నర పాపము బాపుటకై స్రవియించెను
నీ రక్తం అంతరంగ ఆనందం
నీ దివ్యరూపము ఆత్మ శుద్ధికై
ఒసగిన ఈ దివ్య సత్ప్రసాదము llమాll