Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ
మనసు ఉల్లసించెను పల్లవించి పాడెను
పల్లవించి పాటపాడి పరవశించి పొంగెను
తన వాక్కుతో ప్రభు నన్ను దర్శించిన శుభవేళ
1. నింగిలోని జాబిల్లి క్రీస్తు మహిమ పాడగ
నీటిలోని కలువభామ తనకు నాట్యమాడగ
నాదు మరియు నాదు హృదియు తనగీతం పాడెను
2. ప్రభుని వాక్కు నాదమై పలువిధాలు వినిపించగ
అల్లెలూయ గీతాలనే ధరణి ఆలపించగ
నాదు మరియు నాదు హృదియు అల్లెలూయ పాడెను