Type Here to Get Search Results !

మనసున్న మంచిదేవా ( manasuna manchi deva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. మనసున్న మంచిదేవా 

నీ మనస్సును నాకిచ్చావా 

మనసు మలినమైన నాకై 

మనిషిగా దిగి వచ్చావా 

నా మదిని కోవెలగా మలచుకోవయ్యా 

నా హృదిని రారాజుగా 

నిలిచిపోవయ్యా ||మ|| 


1. హృదయము వ్యాధితో నిండిన 

కపట కేంద్రము 

దానిని గ్రహించుట ఎవరిసాధ్యము 

మనస్సు మర్మమెరిగిన మహనీయుడా 

మనస్సు మార్చ గలిగిన నిజదేవుడు ||నా|| 


2. చంచల మనసాడించు బ్రతుకు ఆటకు 

వంచన చేసి నడుపును తప్పుడు బాటను 

అంతరంగమును పరిశీలించు యేసయ్యా 

స్థిరమనస్సుతో నీదారిన సాగనీవయ్యా ||నా|| 


3. నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి 

దీన మనస్సుతో నీకడ శిరము వంచితి 

పూర్ణ మనస్సు కలవానిగ నన్ను మార్చుమా 

తరతరములకు క్షేమము చేకూర్చుమా ||నా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section