Type Here to Get Search Results !

మంచి కాపరి మా యేసయ్యా ( manchi kapari maa yesaya Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. మంచి కాపరి మా యేసయ్యా 

మమ్ముల బ్రోచిన మా యేసయ్యా 

నీ సన్నిధి ప్రాణమయ్యా

నిత్యబాటలో నడుపుమయా 


అ. యేసునాధ నీవే మాకు నామ సంకీర్తనం

యేసునాధ నీవే మాకు నిత్య సంతోషం ||2|| 


1. నీటి మీద నడిచిన ఓ యేసయ్యా 

గాలి అలను గద్దించిన మా యేసయ్యా ||2|| 

పేతురు శిష్యుని అలలపైన నడిపితివయ్యా

విశ్వాసమును ఒసగిన తండ్రివయ్యా ||2|| ||2|| 


2. విధవరాలి దీనారమును మెచ్చితివయ్యా||2|| 

దీనాత్ములు ధన్యులని చెప్పితివయ్యా ||2|| 

శిష్యుల పాదం కడిగి, సేవలు చేసితివయ్యా ||2|| 

ప్రేమ శాంతి మార్గమునే కోరితివయ్యా ||2|| ||2|| 


3. పేదలకు సువార్తను బోధించావయ్యా

బాధలలో ఉన్నవారిని దీవించావయ్యా 

పాపములో పడినవారిని లేపితివయ్యా ||2|| 

పీడితులకు విమోచనము నిచ్చితివయ్యా ||2|| మ ||


4. దేవుడు మా తండ్రియని చూపితివయ్యా ||2|| 

పొరుగువాడు సోదరుడని చెప్పితివయ్యా ||2|| 

కలసి మెలసి ఉండాలని సెలవిచ్చావయ్యా ||2|| 

అలసి సొలసి వున్నవారిని రమ్మన్నావయ్యా ||2|| ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section