Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మంగళమే యేసునకు- మనుజావ తారునకు
శృంగార ప్రభువునకు – క్షేమాధిపతికి ll మంగళ ll
1:-
పరమ పవిత్రునకు – వర దివ్య తేజునకు
నిరుపమానందునకు నిపుణ వైద్యునకు ll మంగళ ll
2:-
దురిత సంహారునకు – వర సుగుణాదారునకు
కరుణా సంపన్నునకు – జ్ఞాన దీప్తునకు ll మంగళ ll
3:-
సత్య ప్రవర్తునకు – సద్ధర్మ శీలునకు –
నిత్య స్వయం జీవునకు నిర్మలాత్మునకు ll మంగళ ll
4:-
యుక్త స్తోత్రార్హునకు –భక్త రక్షా మణికి –
సత్య పరంజ్యోతి యగు – సార్వ భౌమునకు ll మంగళ ll
5:-
నరఘోర కలుషముల – రూపుమాపంగ –
నిల కరుదెంచిన మా పాలి – వర రక్షకునకు ll మంగళ ll
6:-
పరమ పురి వాసునకు – నర దైవ రూపునకు
పరమేశ్వర తనయునకు – బ్రణుతింతుము నిన్ను ll మంగళ ll