Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: ద్రాక్షావల్లి
మంచి కాపరి - మమ్ము కాచు కాపరి
మార్గ చూపరి - మమ్మేలు కాపరి
మా రక్షణ ద్వారమైన మహాకాపరి
మా కోసం ప్రాణమిచ్చిన మంచికాపరి
1. అంధకారలోయలో నే నడిచినను
నీవాక్కు వెలుగుతో నన్ను కాచెదవు
అకలిదప్పులతో నే అలమటించినను ||2||
నీ మధుర హక్కుతో నను పోషించెదవు
నీవే నా కాంతి, నీవే నా శాంతి
నీవే నా సర్వం - నీవే నా సకలం
2. ఈ లోక సాగరంలో నే మునిగినను
నీ వాక్కు బలముతో నను రక్షించెదవు
నీ జీవన దీపం ఆరిపోయినను
నీ అమర జ్వాలతో వెలిగించేదవు ||2||
నీవే నా జీవం - నీవే నా మార్గం
నీవే నా సత్యం - నీవే నా గమ్యం