Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
హల్లెలూయ ....హల్లెలూయ.. హల్లె ||4||
మంచి కాపరిని నే మంచికాపరిని ||2||
గొర్రెలన్నీ నాకు గురుతే
నామందకు నేను ఎరుకే ||2||
1. తోడేళ్ళే వచ్చినా చెదరనీయను మందను
తప్పిపోయిన గొర్రెను వదలివేయను ఎన్నడు
కంటి పాపగ కాచుకొందును
ప్రాణ ప్రధముగ పెంచుకొందును ||2|| ||హల్లె||
2. ఇదేమందకు చెందని
ఇతర గొట్టెలు కలవు ఎన్నో
నాదు స్వరమును ఆలకించి
దరికి చేరుట తధ్యము. ||2||
అపుడు ఒకటే మందయుండును
ఉండునొకడే మంచికాపరి ||2|| ||హల్లె||