Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. మంచిది మంచిది మంచిది
మహోన్నతుని నామమున
కీర్తించుటే బహుమంచిది
సర్వోన్నతుని వాక్యమును
ధ్యానించుటె బహుమంచిది
ఉదయమున నీ కృపను
ప్రతి రాత్రి నీ మేలులను
గంభీర ధ్వని గల సితారతోను
కొనియాడుటే బహుమంచిది ||మ||
1. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె
చిగురించెదరు
దేవదారు వృక్షంవలె ఎదుగుదురు
యావే మందిరమున నాటబడిన వారై
దైవ ప్రాంగణమున వర్ధిల్లెదరు
ఇదే దైవ వాక్కు ఇదే జీవ వాక్కు