Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: నే సాగేద యేసునితో
ప. మంచుకన్న చల్లనిది మల్లెలకన్న తెల్లనిది ||2||
మరపురానిది మరువలేనిది
మారని ప్రేమది నా యేసుది ||2||
1. మార్గం జీవం సత్యం రానే
మారిన మనస్సుల మనుగడ తానే ||2||
మమతల పెన్నిధి సుమధుర సన్నిధి ||2||
నా యేసు ప్రేమది నాక్రీస్తు ప్రేమది ||2|| ||మ||
2. మానవకోటిని రక్షించే తానే
మరణము గెలిచిన ప్రభువు తానే .. ||2||
మమతల పెన్నిధి సుమధుర సన్నిధి ||2||
నా యేసు ప్రేమది నా క్రీస్తు ప్రేమది ||2|| ||మ||