Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప|| మట్టి ముద్దను నేనయ్యా
నీ పాత్రగా మలచుమాపాత్రగా మలచి
నీ సేవకు వినియోగించుమా
ప్రేమ చూపినను నీ కరుణతో
కొనసాగించుమా ||2||
అవధిలేని నీ ఆత్మశక్తితో
ఆదరించుమా ||2|| ||మట్టి||
1. నీ సేవ చేసెదను నీ దాసునిగా
నీ ఘనత చాటెదను నీ సేవకునిగా
నాధా ప్రీతితో నన్నాదరించవా ||2||
ఆదరించి ప్రేమతోడ బలపరచవా ||2||
||ప్రేమ చూపి|| ||మట్టి||
2. సర్వజనాళికి నీదు వాక్కును బోధించగా
పవిత్రాత్మ శక్తితో మమ్మాదరించవా
నీ వలన సర్వము సాధ్యమగునని ||2||
సంపూర్ణ విశ్వాసంతో మమ్మునింపవా ||2||
||ప్రేమ చూపి|| ||మట్టి||