Type Here to Get Search Results !

మంగళమే యేసునకు ( mangalame yesunaku Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. మంగళమే యేసునకు

మనుజావ తారునకు 

శృంగార ప్రభువునకు

క్షేమాధిపతికి మంగళమే ||మ|| 


1. పరమ పవిత్రునకు - వర దివ్య తేజునకు

నిరుపమానందునకు నిపుణ 

వైద్యునకు మంగళమే ||మ|| 


2. దురిత సంహారునకు

వరసుగుణాదారునకు 

కరుణా సంపన్నునకు

జ్ఞానదీపునకు మంగళమే ||మ|| 


3. సత్య ప్రవర్తనకు

సద్ధర్మ శీలునకు - నిత్య

స్వయం జీవునకు

నిర్మలాత్మునకు మంగళమే ||మ|| 


4. యుక్త స్తోత్రారునకు

భక్త రక్షామణికి - సత్య 

పరంజ్యోతి యగు

సార్వ భౌమునకు మంగళమే ||మ|| 


5. పరమపురి వాసునకు

నరదైవ రూపునకు 

పరమేశ్వర తనయునకు

ప్రణుతింతుము నిన్ను మంగళమే ||మ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section