Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దడదడలాడ బండ గుండెలు ....
ముక్కలు కాగా ముసురుచీకటి
పారిపోగా ప్రళయమృత్యువు ...
ఉత్తానమాయే... క్రీస్తు...
Happy Happy Easter ||3||
మృత్యుంజయుడితడే...
తొలిమృత్యుంజయుడితడే ||2||
మృత్యువునోడించే ... మనశాపము
తొలగించే ||2||
||మృత్యుం||
1. కలువరి వేదికగా తన కరములు చాపగనే
కలవరపడి ఓడె తరతరముల పెనుమరణం
నాశన లోకమును తన సిలువతో మనకై గెలిచాడు
శాశ్వత జీవముకై పరలోకపు తొలిబీజము వేసాడు
||Happy Happy||
2. నిరతము జీవించే నిత్యలోకము చూపాడు
అమరపు మనుగడకై శ్రీకారము చుట్టాడు
రక్షణ వారధిగ తన సిలువను మనకై : నిలిపాడు
మోక్షపు వాకిలిగ మన మధ్యనే సమాధిని మలిచాడు
||Happy Happy||