Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మనిషిని మలిచే కరములు
మనసు కలిపే వరములు ||2||
హృదయాల సంగమం దివ్య సత్ప్రసాదం
లోకొని తరించుదాం ఈ దివ్య ప్రసాదం
జీవమొసగు యేసుప్రభునితో
ఏకమై జీవించుదాం ||2|| ||మనిషిని||
1. ద్రాక్షవల్లిని నేను రెమ్మలుగా మీరు ||2||
నాలో నిలిచి ఉండుడు ||2||
అని పలికిన యేసుతో ||2||
దీనతతో శాంతితో జీవించుదాం ||2||
||జీవమొసగు|| ||మనిషిని||
2. నీమిత్రుని కోసం ప్రాణదానం చేసిన ||2||
ఆ ప్రేమే సాటిలేనిది ||2||
అని పలికిన యేసుతో ||2||
మైత్రితో మమతతో కలిసి సాగుదాం ||2||
||జీవమొసగు|| ||మనిషిని||