Lyrics: Fr. Dusi Devaraj
Tune: Fr. D.V. Prasad
Music: Dattatreya
Album: జీవశృతి - 7
మనోహరమౌ ఈ ప్రపంచం
దైవ చింతన నిలయం} ll 2 ll
యేసుని నామం చేద్దాము ధ్యానం
మనసార మనమందరం
1 చరణం:
ఈ చిన్న బిడ్డలదే - దైవరాజ్యమనుచు
వీరి మనసుల పోలిన మనుజకు ll 2 ll
ఆ ప్రభు సన్నిధిలో సంతసముండునని
ప్రతి నిత్యముండునని llఆ ఆ ఆll llమనోll
2 చరణం:
యజమానుడవగోరిన ప్రతివాడు దాసుడై ఉండవలెన్
పొరుగువారిని ప్రేమతో నీవలె ll 2 ll
ప్రేమింప లేకున్నచో ప్రేమ కర్ధం లేదని
నీ ప్రేమ వ్యర్ధమని llఆ ఆ ఆll llమనోll