Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: స్పందన
ప. మనోహరము మహెూజ్జ్వలము
యేసుని వాక్యం సుధామృతము
స్వరామృతము క్రీస్తుని వేదం ||2||
సువిశేష కాంతులు వెలిగే
అంధకార శక్తులు తొలగే ||2||
మనసార పాడుదము
నజరేయుని వచనం ||2||
హల్లెలూయ.. హల్లెలూయ..
హల్లెలూయ... హల్లెలూయ
1. పక్షవాత రోగిని క్షమియించిన క్షమా వాక్యం
మృతుడైన లాజరును బ్రతికించిన జీవవాక్యం
మార్గం.. సత్యం.. జీవం.. ప్రభు యేసే ||2||
కారు చీకటిలో వెలుగాయె
సుమధుర వాక్యం
హల్లెలూయ.. హల్లెలూయ..
హల్లేలూయ.. హల్లెలూయ ||2||
2. నవ జీవన సౌభాగ్యం
శ్రీ యేసుని నవ్యవాక్యం
మనుజాళికి సంజీవం
శ్రీ క్రీస్తు దివ్యవాక్యం ||2||
ప్రేమా.. సేవా..త్యాగం...ప్రభు యేసే ||2||
ఈ జీవయాత్రలో నడిపించు
మంజుల వాక్యం
హల్లెలూయ.. హల్లెలూయ.. హల్లెలూయ... హల్లెలూయ ||3|| మll