Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. మారాలి మారాలి నీ మనసే మారాలి
మారిన మనస్సు దేవునికిస్తే ఫలితముంటుంది
1. మారామంటు మారామంటు
మస్కా గొడతారు ఆ మస్కాలోనే
దేవుని మాట మరచిపోతారు ||మా||
2. నీ జీవితమంతా ఒక్కొక్కసారి పరీక్ష చేయాలి
ఆ పరీక్షలోనే పాపాలన్ని పెరికివేయాలి ||మా||
3. క్రీస్తునామం చాటామంటు సాక్ష్యం చెబుతారు
ఆ సాక్ష్యం కాస్తా సాగకపోతే చతికిలబడతారు. ||మా||
4. దేవుని కొరకు పుట్టామంటు గొప్పలు చెబుతారు
ఆ గొప్పలు కాస్తా సాగకపోతే గోతిలో పడతారు ||మా||
5. రోగముకొరకు దేవునికెన్నో - మొక్కులు మొక్కుతారు
ఆ రోగము పోతే - దేవుని మాట మరచిపోతారు ||మా||
6. నిలకడలేని జీవితమంతా - నీలో ఉంచుకొని
ఎదుటివారికి బుద్దులు చెప్పి తప్పులు చేస్తావు ||మా||