Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: నా యేసయ్యా
ప. మారని దేవుడవు నీవేనయ్యా
మరుగై ఉండలేదు నీకు యేసయ్యా ||2||
సుడులైన సుడిగుండాలైన-వ్యధలైన వ్యాధిబాధలైన
మరుగు ఉండలేదు నీకు యేసయ్య ||2|| ||మా||
1. చిగురాకుల కొసల నుండి జారిపడే మంచుల
నిలకడలేని నా బ్రతుకును మార్చితివే ||2||
మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా
మారని దేవుడవయ్యా మరువని యేసయ్య||2||
2. నాజీవిత యాత్రలో మలుపులెన్ని తిరిగినా
నిత్యజీవిత గమ్యానికి నను నడిపించితివే ||2||
నిలిచియుందునయ్యా నిజదేవుడవనుచు
నన్ను చూచినావు నన్ను కాచినావయ్యా ||2|| ||మా||