Type Here to Get Search Results !

మరణమా మరణమా ( maranama maranama Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మరణమా మరణమా- ఎప్పుడు వస్తావో ఎక్కడ వస్తావో 

ఎవరికొస్తావో – తెలియనే తెలియదు ll 2 ll 

కులమత భేదం లేని దానివి – వయోభేదం లేని దానివి ll 2 ll

యేసు నాకు తోడుండగా – నేను నీకు భయపడను సుమా ll 2 ll


1 వ చరణం 

పిండముగా ఉన్నప్పుడో - ప్రసవ బాధలో ఉన్నప్పుడో 

పాలు త్రాగుతున్నప్పుడో - అమ్మ చంక నున్నప్పుడో ll 2 ll

ఎప్పుడు వస్తావో తెలియదు – ఎలా వస్తావో తెలియదు ll 2 ll

ఎప్పుడు వచ్చినా సిద్ధమే – ఇదే ఇదే నా ప్రభు వేదం ll యేసు ll 


2 వ చరణం 

ప్రాకుతూ ఉన్నప్పుడో – లేచి నడుస్తున్నప్పుడో 

పరుగెత్తుచున్నప్పుడో – భుజియిస్తూ ఉన్నప్పుడో ll 2 ll ll ఎప్పుడు ll


3 వ చరణం 

చదువుతూ ఉన్నప్పుడో – ఆడుతూ ఉన్నప్పుడో

పాడుతూ ఉన్నప్పుడో - ఏడుస్తూ ఉన్నప్పుడో ll 2 ll ll ఎప్పుడు ll


4 వ చరణం 

మిత్రులతో ఉన్నప్పుడో - శత్రువులతో ఉన్నప్పుడో

బంధువులతో ఉన్నప్పుడో - సోదరులతో ఉన్నప్పుడో ll 2 ll ll ఎప్పుడు ll


5 వ చరణం 

శోధనతో ఉన్నప్పుడో - వేదనలో ఉన్నప్పుడో

శ్రమలలో ఉన్నప్పుడో - రోగములో ఉన్నప్పుడో ll 2 ll ll ఎప్పుడు ll


6 వ చరణం 

వయసులో ఉన్నప్పుడో - వార్ధక్యంలో ఉన్నప్పుడో

జల్సాలో ఉన్నప్పుడో - సోకులలో ఉన్నప్పుడో ll 2 ll ll ఎప్పుడు ll


7 వ చరణం 

అందరిలో ఉన్నప్పుడో - ఒంటరిగా ఉన్నప్పుడో

ప్రయాణంలో ఉన్నప్పుడో - పనిచేయుచున్నప్పుడో ll 2 ll ll ఎప్పుడు ll


8 వ చరణం 

గుడిలో ఉన్నప్పుడో - బడిలో ఉన్నప్పుడో

మడిలో ఉన్నప్పుడో - మఠములో ఉన్నప్పుడో ll 2 ll ll ఎప్పుడు ll


9 వ చరణం 

ఉదయంలో ఉన్నప్పుడో - సంధ్య వేళలో ఉన్నప్పుడో

రాత్రి వేళలో ఉన్నప్పుడో – అపరాత్రి వేళలో ఉన్నప్పుడో ll 2 ll ll ఎప్పుడు ll


10 వ చరణం 

మెలకువలో ఉన్నప్పుడో – నిద్రించు చున్నప్పుడో 

నడచు చున్నప్పుడో – కూర్చున్నప్పుడో ll 2 ll ll ఎప్పుడు ll


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section