Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: ప్రధానయాజకుడు
ప. మరణము గెలిచెను యేసయ్య
మూడవనాడు లేచెనయ ||2||
మూసిన రాయి తొలగి
జీవముతో లేచాడని ||2||
కావలి దూతలు తెలిపిరయా ||3||
శిష్యులకు అగుపించెనయా ||2||
హల్లెలూయ హల్లెలూయ ||4||
1. చెప్పిన రీతిన లేచిన యేసు
ముందుగ గలిలయ చేరెనయా ||2||
నమ్మని తోమా సందేహింపగ
ప్రభువే దర్శనమివ్వంగ ||2||
“నాప్రభువా నా దేవా”
అని విశ్వాసముతో నుడివెనయా ||2||
హల్లెలూయ హల్లెలూయ
2. నలుబది రోజులు దర్శనమిచ్చి
శిష్యులను బలముతో నింపి ||2||
త్రియేక దేవుని పేరిట మీరు
సువార్తను ప్రకటించుడని ||2||
“కడవరకు మీతోనే ఉంటాన"ని
తను నుడివెనయా ||2||
హల్లెలూయ హల్లెలూయ ||4||