Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. మార్గము జూపుము యింటికి
నా తండ్రి యింటికి
మాధుర్య ప్రేమ ప్రపంచము
చూపించు కంటికి
1. పాప మమతల చేత - పారిపోయిన నాకు
ప్రాప్తించే క్షామము పశ్చాత్తాపము నొంది
తండ్రిక్షమ గోరుచు పంపుమ క్షేమము
ప్రభు నీదు సిలువ ముఖము
చెల్లని నాకు పుట్టించే ధైర్యము ll మా ll
2. ధనమే సర్వంబనుచు
సుఖమే స్వర్గంబనుచు తండ్రిని వీడితి
ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము
చేసే దేవా నిన్ చేరితి
దేహియని నీవైపు చేతులెత్తిన
నాకు దారిని జూపుము ll మా ll
3. దూర దేశములోన బాగొందనుకొనుచు
తప్పితి మార్గము తరలి పోయిన నేను
నమ్మిన హితులెల
తరిమె దారిద్ర్యము
దాక్షిణ్య మూర్తి నీ - దయనాపై కురిపించి
ధన్యుని చేయుము ll మా ll