Type Here to Get Search Results !

మేఘరథముపైన ( mega rathamupaina Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: యం.ప్రేమ్ కుమార్, 

Tune: Fr. Gnanam SDB 

Music: Naveen M 

Album: ప్రణతులు - 9 


మేఘరథముపైన మహోన్నతము నుండి 

తరలివచ్చె క్రీస్తే అప్పరూపధరుడై ||2|| 

సదాసదయుడు - సుధాహృదయుడు 

ఆత్మరూపచరుడు ||2|| 

సానిసాని ||3|| 


1) మండుచున్న పొదలో - అగ్నిజ్వాలయితడే 

దివ్యమందసములో - వాక్యరూపమితడే |2|| 

తేనెరుచుల మన్నా - స్వర్గభోజ్యమితడే 

సిరులు పొంగుచున్న - రాజ్యమిచ్చెనితడే ||సదా||

ఆ..ఆ..ఆ.. ఆ..ఆ..ఆ.. 


2) దోషములను బాపే - గొర్రెపిల్లయితడే 

రొట్టెవిందు పంచే - రక్తమాంసమితడే

ఆత్మహితము కూర్చే - అమృతమ్ముయితడే 

అమరజీవమిచ్చే - మోక్షమిచ్చునితడే ||సదా॥


3) తిమిరజీవితాన - వెలుగురేఖయితడే

మరణభయములోన - అభయరక్షయితడే ||2|| 

ఆత్మసంగమించే - అప్పరసముయితడే 

నిత్యజీవితములో - సత్యనేస్తమితడే ||సదా||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section