Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సా. మిక్కిలి మరియా ఆవే మరియా
ఆవే మరియా ఆవే - మరియా
ప. మిక్కిలి దయగల తల్లీ...
నీ శరణం కోరుతు వచ్చితిమి
నీ చెంత వచ్చిన వారెవరైనను..
నీ వెన్నడు విడనాడినదేరుగలేదు ||2|| ||మి||
1. శరణంటూ నీ పాదం చేరినవారికి...
కరుణను కుమ్మరించి అనుగ్రహించు ||2||
కనికర సాగర తారకమా....
కాపాడు నిరతము కన్యకరాణి ||మి||
2. నిట్టూర్పు కన్నీరు మాకు స్వంతమై..
వేసారిన మీదు బిడ్డలము ||2||
కొలువలేని తమ జాతి స్తుతి...
పిలుస్తున్నది మీదు అభయము కోరి ||2|| ||మి||
3. అవతారమెత్తిన వచనము యొక్క.
అమలయైన తల్లీ -పుణ్య సంపూర్ణ ||2||
భువిలోన బిడ్డల ప్రార్ధనలు..
ఆలించి ఒసగుము-అభయమమ్మా ||మి||