Type Here to Get Search Results !

మూడునాళ్ల ముచ్చట కోసం ( mudinalla muchata kosam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. మూడునాళ్ళ ముచ్చట కోసం 

ఈ మనిషి తపన చూడరా ||2|| 

నీటి బుడగలాంటి జీవితం 

ఏనాడు సమసిపోవునో ఎరుగం ||2|| ||మూ|| 


1. మనిషికి తనమనస్సే చెరసాలరా 

మమతల మమకారాలే బంధాలురా ||2|| 

వల్లకాటి వరకు బహు బంధాలురా ||2|| 

అవి కలలోనికి చెరవురా అనుబంధాలు ||2|| 

కల్లలైనా కలలు మానుకో 

నిరంతరం ప్రభుని వేడుకో ||2|| ||మూ|| 


2. ఇంద్రధనుస్సు లాంటి దోయి

ఈ సంసారం అదికనిపించి 

మాయమయ్యే రంగుల వలయం 

గడ్డిపువ్వులాంటిదోయి ఇలలో సౌఖ్యం ||2|| 

అది పాపానికి జీవితమురా 

మనిషికి మరణం ||2|| 

కల్లలైన కలలు మానుకో

నిరంతరము ప్రభుని వేడుకో ||2|| ||మూ|| 


3. తప్పిదములు చేయు వాడు వర్ధిల్లడు

అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా ||2|| 

జిగటగల ఊబి నుండి పైకి లేపి ||2|| 

నీ పాదములను కాయునురా 

నిరతము ప్రభువు ||2|| 

నిత్యమైన సుఖము కోరుకో 

నిరంతరము ప్రభుని వేడుకో ||2|| ||మూ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section