Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ముగిసింది ఈ జీవితం -
ఓ సోదరీ ముందున్నది ఇక శాశ్వతం
ముగిసింది మన బంధం ఈ లోకంలో -
ముందున్నది ప్రభు బంధం మరు లోకంలో
1. నీవు మమ్ము విడిచి వెళ్ళినా -
నీ జ్ఞాపకాలు మమ్ము వీడవులే
నీ కోసం అనునిత్యం ప్రార్థిస్తాము -
నీ మంచిని సదా మేము స్మరియిస్తాము
2. కలసి మెలసి బ్రతికామిన్నాళ్ళు -
కనుమరుగై పోతున్నామీనాడు
కన్నీళ్ళతో పలికేము వీడ్కోలూ -
కలుసుకుందాము మళ్ళీ ఓనాడు
3. నీకు జన్మనిచ్చిన దేవుడు -
నీ కోసం ఎదురు చూస్తున్నాడు
నీకిక ఎడబాటు ఉండదు -
ఆయన సన్నిధి నీదైనప్పుడు