Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ముకుళిత హస్తాలతో
నీ ముందు నిలిచితిని
మదిలో నీ మేలు దలచి
మనసారా వేడితిని ||2||
సాటిలేని మేటికానుక
ఈయజాల నీకు ఓ ప్రభు
సాటిలేని మేటికానుక
నేనీయజాల నీకు ఓ ప్రభు
నా దీన కానుక స్వీకరించుమా ||2||
||ముకుళిత||
1. కన్యమరియ కానుక-కలకాల వేడుక
అపోస్తుల కానుక-ఆదర్శ దీపిక ||2||
నాదు దీనకానుక-మన్నించు పలికా ||2||
మాదు జీవితాలకు-నీ ప్రేమ చాలిక ||2||
నిసమగ పమదమప-మప సా దప మదపా
నిసగమరిస నిస దప మప సా దప
మప గమ రినిస ||2|| ||ముకుళిత||
2. ఆబేలుని కానుక-అపురూప జ్ఞాపిక
మెల్కిసెదేకు కానుక-మేలైన వేదిక ||2||
నాదు దీన హృదయమే-నీ పాద పీఠిక ||2||
నీదు ప్రేమ కరముతో-దీవించు పలికా ||2||
||నిసమగ పమదమప॥ ||ముకుళిత||