Lyrics: Fr. Dusi Devaraj
Tune: Fr. D.V. Prasad
Music: Dattatreya
Album: జీవశృతి - 8
ప. నా చిన్న ఆశల - నా నవ్య మనసును
నా జీవితేశుని - అనురాగ కొలువులో
సంపూర్ణ ప్రేమతో-అర్పించుకొందును||నా||
1. నా జీవితాశను-నాకున్న వరములు
నా స్నేహ బంధము-నా పూర్ణ జీవితం
స్వీకరించుమా జీవితేశ్వరా
స్వీకరించుమా ప్రాణనాధుడా
నీకే దేవా అంకితం . ||నా||
2. నాలోని వేదన - హృదయ భారము
నాదీన జీవితం'- నా పేద కానుక
స్వీకరించుమా జీవితేశ్వరా
స్వీకరించుమా ప్రాణ నాధుడా
నీకే ఇలలో అంకితం ||నా||