Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: నీపద సేవలో-2
ప. నాకోసమే జీవించే ప్రియుడవు నా నేస్తమా
నీ సర్వము నాకోసమే అర్పణ చేసిన
హితుడవు నీవు
1. నాకొరకు నీమదిలో నిరతము
తలచే నా దేవా
నామాట మధురముగా
మననంచేసే నా స్వామి
నా కంటే అధికముగా
దేనిని కోరని నా ప్రియుడా
నాలోని ఈ ప్రాణం నీదే కాదా నా దేవా ||నా||
2. నా కోసం ఈ లోకంలో సృష్టించితివే
నాదేవా నీదేగా ఈ సకలం
లేనిది ఏది నా స్వామి
నా కంటూ ఏముంది
అర్పణ చేయగా నా హితుడా
నా స్వరము నీదేగా
చేకొనుమయ్యా నా హితుడా ||నా||