Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. నా యేసు నీతోనే నా జీవితం గడిపెదను
నా యేసు నీలోనే నిరతరం నిలిచెదను ||2||
ఇహమందైన పరమందైన ||2||
ఉన్నవాడవు నాతో ఉండువాడవు ||2|| ||నా||
1 ఒంటరినైనప్పుడు - నా తోడుగ నిలచితివి
నూతన ప్రాంతాలకు-నాముందుండి నడిపితివి
నీ ఆజ్ఞలు నాలో ఉంచి-నీ ప్రేమను నాలో పెంచి
పరిశుద్దుల స్థానములో ఉంచితివి ||2||
పరిశుద్ధుల సహవాసం ఒసగితివి ||2|| ||నా||
2 వాక్యమనే ఖడ్గంబును
నా చేతికిచ్చితివి
రక్షణ గల నీనామమును
నా నోట నుంచితివి ||2||
నీ కార్యము నాలో వుంచి - నీ మహిమ పెంచి
విశ్వాసుల సంఘములో నిలిపితివి
విశ్వాసపు కోటలో దాచితివి ||2|| ||నా||