Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. నా ఆరాధ్యదైవం నీవే
నా అపురూప బంధం నీవే
నా హృదయ సమర్పణ నీవే
నా అన్నియు నీవే అందుకో దేవా ||నా||
1. మారని ప్రేమకు మనస్సే అర్పింతు
తరగని కృపకు తనువే అర్పింతు
ఏమర్పించినా తగున ని ప్రేమకు
నా పేద కానుక అందుకో దేవా ||నా||
2. నీ ప్రాణ త్యాగము అమరము దేవా
ఉదార స్వభావము మధురము దేవా
ద్రాక్షారసములో జల బిందువుగా
నన్ను చేర్చి దీవించుము దేవా ||నా||