Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: ప్రధాన యాజకుడు
ప నా ఆశ నిజమైన ఈ శుభవేళ ||2||
నే వేసెద నీ మెడలో సుమముల మాల||2||
ఈ ఆనంద సుందర సుమధుర గానాల
ఆరాధన గైకొన రావేలా ||2||
1. పిలచిన అబ్రహామును దీవించిన దేవా
నత్తివాడు మోషేను నడిపించిన దేవా ||2||
పూజారి మెల్కిసెదెకుని పూజ్యుడయిన దేవా
నా సర్వము నీ సేవకై గైకొనరావా ||ఈ||
2. జాలరులను ప్రేమతో పిలచుకొన్న దేవా
హింసించిన సౌలును కూడా దర్శించిన దేవా ||2||
నన్ను పిలచి దీవించగ వేగమే రావా ||2||
సమర్పించెద నా సర్వము నీ సేవకై ||ఈ||