Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప నా యాత్మ నీ కోసమే తపించుచున్నది
నా జీవిత పయనము గమ్య మెరుగకున్నది
నా పాప భారాన్ని తొలగించుమా
నా జీవితమును పదిల పరచుమా ||2||
1. పాప కూపములో చిక్కుకొని యున్నాను
నాలోని వేదనను తొలగించుమా ||2||
నీ ప్రేమ నాపైన చూపించుమా
నీ హస్తములతో నన్ను నడుపుమా ||నా||
2. ఈ లోక ఆశలలో మునిగిపోయి ఉన్నాను
కరుణించి క్షమించి దీవించుమా
విరిగిన నలిగిన నా హృదినే
నీ పాదములకడకు చేర్చుకో తండ్రి ||నా||