Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్ల :నా ఆత్మమా ప్రభువును - స్తుతింపుము
నాలోని సమస్తమా - ప్రభువును పొగడుము ||2||
ప్రభువు చేసిన మేులులను - మరువక స్తుతింపుము
సువార్త సేవలో నిన్ను నిలిపిన - ప్రభువును పొగడుము
స్తుతింపుము - పొగడుము - యేసుని నామము ||2||
1 వ చరణం..
చిన్నవాడను నేనని పలికిన - యిర్మియా ప్రవక్తను
నీదు ఆత్మతో నింపితివి - నీదు సాక్షిగా మార్చితివి ||2||
బలహీనమైన నన్ను కూడ - పిలిచితివా నీ సేవకై ...
నడిపించు నడిపించు - నీ వాక్య వెలుగులో నడిపించు ||2||
దీవించునను దీవించు - నీ సాక్షిగానను దీవించు llనాll
2 వ చరణం..
నీదు రాజ్యం రావాలని - ఆశించిన ఆర్‌నాల్డ్‌ను ||2||
నీ వాక్య దీపంలో - నడిపించిన ప్రభు నీవు ||2||
బలహీనమైన నన్ను కూడ - పిలిచితివా
నీ సేవకై బలపరచు బలపరచు - నీ ఆత్మతో
నన్ను బలపరచు స్థిరపరచు
నన్ను స్థిరపరచు - నీ సాక్షిగా నన్ను స్థిరపరచు ||2||