Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: unknown
నయనాల విరిసింది నీ రూపము
ఎదలోన పలికింది నీ రాగము
ఉదయించు నాలో తేజోనిధీ
ప్రభవింప నాలో పరమావధి ||నయనాలు|| 1. నీలాల గగనాలు వెలుగొందగా
రవిచంద్ర తారలు నిను చాటగా ||2||
జాబిల్లి నీవే వెన్నెల్లు నాలో ||2||
కురిపించరావా నా యేసువా ||నయనాలు||
2. భూమాత ఒడిలోన వికసించిన
పశుపక్షి పూవులు నిను పాడగా ||2||
విరజాజి నీవై విరబూసి నాలో ||2||
వెదజల్లి రావా నా యేసువా ||నయనాలు||
3. నీ వేద నాదాలు పలికించగా
నా జీవ వీణను మోగించవా ||2||
నా రాగ సుధవై నా ప్రేమ నిధివై ||2||
దివించ రావా నా యేసువా ||నయనాలు||