Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. నయనాల పాపల్లో అందాల చంద్రమా
ధవళ వెలుగుల్లో చందనాల పావురమా
వాక్య దీపమా - యేసు దైవమా
భువిలో మనోజ్ఞ-మహిమాణిముత్యమా ||న||
1. భాషలకందని బోధకుడు
స్వరములకందని స్వర్గపతి
పదములకందని పావనుడు
పరిమళ వార్తకు ప్రసన్నుడు ||న||
2. జగములు చూడని వెలుగతడు
ఆకాశ దేశాల తారతడు
జీవపు ప్రమిదల ఛాయతడు
తమసును బాపిన నాయకుడు ||న||
3. నిత్యపు జీవపు ఆహారము
విరోధి మధ్యన సహచర్యము
విశ్వపు ప్రాణుల ఆధారం
త్రిత్వైక దేవుని అద్భుతము ||న||